దుబాయ్‌లో 45 శాతం షవరమా స్టాండ్స్‌ మూసివేత

- November 01, 2016 , by Maagulf
దుబాయ్‌లో 45 శాతం షవరమా స్టాండ్స్‌ మూసివేత

దుబాయ్‌: దుబాయ్‌లో 45 శాతం షవరామా స్టాండ్స్‌ మూసివేయబడనున్నాయి. షవరామా స్టాండ్స్‌ విషయంలో మునిసిపాలిటీ ఖచ్చితమైన గైడ్‌లైన్స్‌ రూపొందించి, వాటిని పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో కొన్ని స్టాండ్స్‌, మునిసిపాలిటీ గైడ్‌ లైన్స్‌ మేరకు మార్పులు చేర్పులు చేస్తుండగా, మరికొన్ని మూసివేతకు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం 572 మీడియా ఫుడ్‌ ఔట్‌లెట్స్‌కి షవరామా స్టాండ్స్‌ విషయమై ఆరు నెలల డెడ్‌లైన్‌ని విధించారు. వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమన్న కోణంలో కొత్త విధి విధానాల్ని మునిసిపాలిటీ జారీ చేసింది. అక్టోబర్‌ 31తో ఈ డెడ్‌లైన్‌ ముగిసింది. ఇప్పటివరకు కేవలం 318 స్టాండ్స్‌ మాత్రమే మార్పులు చేర్పులు చేసుకున్నాయి విధి విధానలకు అనుగుణంగా.113 స్టాండ్స్‌ పూర్తిగా ఆపివేయబడ్డాయని, 141 స్టాండ్స్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టాండ్‌ ఉన్నా మూసివేయిస్తామని ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ - ఫుడ్‌ ఇన్‌స్పెక్షన్‌ సెక్షన్‌ హెడ్‌ సుల్తాన్‌ అలి అల్‌ తాహెర్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com