ద్రోన్లతో నష్టంపై ఎమిరేట్స్ ఆవేదన
- November 01, 2016
ఫ్లైట్ డైవర్షన్స్, నెట్వర్క్ సమస్యలు ఇవన్నీ డ్రోన్ల కారణంగా ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులుగా గుర్తించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డిఎక్స్బి) పరిసరాల్లో ద్రోన్లు సృష్టిస్తున్న నష్టం చాలా ఎక్కువేనని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తేల్చింది. మిలియన్స్ ఆఫ్ దిర్హామ్స్ ప్రతిసారీ నష్టపోవాల్సి వస్తోందని ఆ సంస్థ విశ్లేషించింది. వేలాదిమంది ప్రయాణీకులు వీటితో ఇబ్బంది పడుతున్నారని ఎమిరేట్స్ వర్గాలు వెల్లడించాయి. ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అదెల్ అల్ రెధా మాట్లాడుతూ, ఫ్లైట్ డైవర్షన్లు, ఎక్స్టెన్సివ్ హోల్డింగ్ అనేవి చాలా ఖరీదైన సమస్యలుగా మారుతున్నాయని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా మూడు ఇన్సిడెంట్స్ చాలా ఇబ్బందికరంగా మారాయి. అక్టోబర్ 29న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 80 నిమిషాలపాటు మూసివేయబడింది. 22 విమానాల్ని మళ్ళించాల్సి వచ్చింది. వీటిల్లో 11 ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి చెందినవే. సెప్టెంబర్‌లో 30 నిమిషాలపాటు సమస్య తలెత్తింది. ఎమిరేట్స్‌కి చెందిన 85 విమానాల షెడ్యూల్ డిలే అయ్యింది. జూన్‌లో కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. భద్రత అతి ముఖ్యమైన అంశమనీ, అలాగే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం, సమయపాలన కూడా ముఖ్యమని చెబుతూ ద్రోన్ల విషయంలో ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అల్ రెధా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









