పేలుడు కేసులో నిందితుల విచారణ
- November 02, 2016
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్ 11 మంది నిందితుల్ని హై క్రిమినల్ కోర్ట్‌కి రిఫర్ చేసింది. డిసెంబర్ 7న ఈ కేసు విచారణకు రానుంది. షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా వెన్యూలో అల్ నువైదెరాత్ రౌండెబౌట్ ప్రాంతంలో జూన్ 30న జరిగిన పేలుడు ఘటనలో ఈ 11 మంది నిందితులు. బహ్రెయిన్‌కి చెందిన ఓ మహిళ ఈ పేలుడులో మృతి చెందింది. నిందితులో 9 మంది పోలీసు కస్టడీలో ఉన్నారు. పరాయి దేశంతో కలిసి స్వదేశానికి చెందిన రహస్య సమాచారాన్ని తస్కరించడం, పేలుళ్ళకు పాల్పడటం, వెపన్స్‌ని సమీకరించడం, వెపన్స్ మరియు బాంబుల్ని పేల్చడంలో శిక్షణ పొందడం వంటి నేరాలు వీరిపై మోపబడ్డాయి. ఇరానియన్ రివల్యూషన్ గార్డ్ తరఫున ఇరాన్లో శిక్షణ పొందిన వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు బాంబుని తయారు చేయగా, మరికొంతమంది బాంబుని పేల్చారు. పేలుడులో ఓ మహిళ మృతి చెందగా, ఆమె పిల్లలకు గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







