'రెమో' చిత్ర తెలుగు ఆడియో విడుదల...
- November 02, 2016
శివకార్తీకేయన్, కీర్తి సురేష్ జంటగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'రెమో' చిత్రాన్ని 24 ఎం.ఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. అనిరుథ్ సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న హీరోయిన్ సమంత థియేట్రికల్ ట్రైలర్‌ని, ఆడియోను విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ, 'శివ కార్తీకేయన్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఓ స్టార్ హీరో సూపర్ స్టార్ కావడం ఆయన్ని చూసే తెలుసుకున్నా. అనిరుథ్ మంచి సంగీతం అందించారు. ఆయనిప్పుడు నాకిష్టమైన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తమిళంలో హిట్ అయినట్టుగానే తెలుగులోనూ ఈచిత్రం పెద్ద విజయం సాధించాలి. 24ఏ.ఎం.స్టూడియో బ్యానర్లోనే శివకార్తీకేయన్‌తో ఓ సినిమాలో నటించబోతున్నాను' అని తెలిపింది. 'తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న దిల్‌రాజుకి థ్యాంక్స్. పి.సి.శ్రీరాంతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
దర్శకుడు నన్ను అందమైన అమ్మాయిగా మార్చేశాడు. కీర్తిసురేష్ నా లేడీ గెటప్ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. అనిరుథ్ చాలా సన్నగా ఉన్నా, అమితాబ్‌లా పాజిటివ్ వాయిస్‌ను కల్గి ఉన్నాడు. ఇది మంచి కలర్‌ఫుల్ ఎంటర్టైనర్.
ఇందులో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. తెలుగులో విడుదలవుతున్న నా తొలి చిత్రమిది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆదరించాలని కోరుకుంటున్నా' అని శివకార్తీకేయన్ తెలిపారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, 'తమిళంలో పెద్ద హిట్టై మంచి కలెక్షన్లను రాబట్టడంతో తెలుగులో విడుదల చేస్తున్నా. ఈనెలలోనే రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా శివకార్తీకేయన్‌కు తెలుగులో మంచి ఎంట్రీ అవుతుంది. ఆయన నటించిన లేడీ గెటప్ బాగా అలరిస్తుంది.
సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది' అని చెప్పారు. 'ఈ చిత్ర టీమ్‌ను నా ఫ్యామిలీలా భావించి సినిమా చేశా. ఇదొక బెస్ట్ చిత్రమవుతుంది' అని పి.సి.శ్రీరామ్ తెలిపారు. అనిరుథ్ చెబుతూ, 'శివకార్తీకేయన్‌తో నాకిది నాలుగో చిత్రం.
ఈ సినిమాకు పని చేయడం ఒక ఎమోషనల్ జర్నీ. కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించారు. రాజ్ కన్నన్ కూల్ డైరెక్టర్. శివకార్తీకేయన్ మంచి వ్యక్తి.
తనని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, భాగ్యరాజ్ కన్నన్, కె.ఎస్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









