దుబాయ్‌ ఎక్స్‌పో 2020 సన్నాహక సమావేశం

- November 03, 2016 , by Maagulf
దుబాయ్‌ ఎక్స్‌పో 2020 సన్నాహక సమావేశం

మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఫర్‌ దుబాయ్‌ ఎక్ప్‌ఓ 2020 బ్యూరో రీమ్‌ అల్‌ హాషిమి, దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ (దెవా) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సయీద్‌ మొహమ్మద్‌ అల్‌ తాయెర్‌తో సమావేశమయ్యారు. దెవా హెడ్‌ ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. ఎక్స్‌పోకి సంబంధించి దెవా సహాయ సహకారాలపై ఈ సమావేశంలో చర్చించారు. దుబాయ్‌ ఎక్స్‌పో 2020కి సంబంధించిన ప్రిపరేషన్స్‌పై కాంప్రహెన్సివ్‌ రివ్యూ ఈ సమావేశంలో జరిగింది. దుబాయ్‌ ఎక్స్‌పోకి అన్ని విధాలా దెవా సహాయ సహకారాలు అందిస్తుందని అల్‌ తాయెర్‌, అల్‌ హాషిమికి హామీ ఇచ్చారు. దుబాయ్‌ ఎక్స్‌పోకి సంబంధించిన ప్రిపరేషన్‌లో భాగంగా 132/11 కిలోవాట్‌ సబ్‌ స్టేషన్స్‌, 45 కిలోమీటర్ల హై ఓల్టేజ్‌ (132 కెవి) కేబుల్స్‌కి సంబంధించిన ప్రోగ్రస్‌పైనా చర్చించారు. ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల ఖర్చు మొత్తం 420 మిలియన్‌ డాలర్లు కానుంది. ఎక్స్‌పో 2020, మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ సోలార్‌ పార్క్‌కి కనెక్ట్‌ చేయబడుతుంది. ఈ పార్క్‌ ద్వారా 200 మెగావాట్స్‌ క్లీన్‌ ఎనర్జీని అందించనుంది. 2017 నాటికి ఈ పార్క్‌ తాలూకు సబ్‌స్టేషన్స్‌ పని ప్రారంభిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com