కొత్త భీమా పధకాన్ని ప్రవేశ పెట్టనున్న రైల్వే సంస్థ

- November 03, 2016 , by Maagulf
కొత్త భీమా పధకాన్ని ప్రవేశ పెట్టనున్న రైల్వే సంస్థ

రైలు ప్రయాణికులకు 92 పైసలకే ప్రమాద బీమా అందిస్తున్న ఐఆర్‌సీటీసీ ఇప్పుడు మరో బీమా పథకం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రైలు ప్రయాణికుల వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్స్‌కు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ అధికారులు, బీమా అధికారులకు మధ్య తొలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తప్పుడు దావాలపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయని, తాము వారితో తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నామని ఐఆర్‌సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా గురువారమిక్కడ తెలిపారు. తొలి దశలో ఈ బీమా సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com