సాధారణ స్థితికి వచ్చిన అమ్మ..

- November 03, 2016 , by Maagulf
సాధారణ స్థితికి వచ్చిన అమ్మ..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సాధారణ స్థితికి వచ్చినట్లు గురువారం అధికార అన్నాడీఎంకే వెల్లడించింది. జయలలిత ఆహారాన్ని సైతం తీసుకుంటున్నట్లు పార్టీ నాయకురాలు సీఆర్ సరస్వతి తెలిపారు. ఆమె ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పన్‌రుత్తి ఎస్.రామచంద్రన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగైనట్లు తెలిపారు. ప్రజల ప్రార్థనలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు.

అమ్మకు నటి శారద పరామర్శ 
ముఖ్యమంత్రి జయలలితను సీనియర్ నటి ఊర్వశి శారద గురువారం ఉదయం అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

అమ్మ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శారద మీడియాతో మాట్లాడుతూ.. జయలలితను చూడటానికి బాధగా వెళ్లానని, అయితే డాక్టర్ల మాటలు విన్నాక చాలా ఆనందంగా ఉందన్నారు. అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి జయలలిత 45 రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com