మళ్లీ తగ్గుతున్న వెండి,పసిడి ధర
- August 26, 2015
ముంబై బులియన్ మార్కెట్‌లో రెండు రోజుల్లో రూ.765 డౌన్ - అంతర్జాతీయ బలహీన ధోరణి ప్రభావం ముంబై: పసిడి, వెండి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో ముంబై బులియన్ మార్కెట్‌లో పసిడి 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.765 పడింది. వెండి కేజీ ధర రూ.1,355 నష్టపోయింది. స్థానిక బులియన్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.355 పడి రూ.26,595కు చేరింది. 22 క్యారెట్ల ధర సైతం అంతే పరిమాణంలో కిందకుదిగి రూ.26,445కు జారింది. వెండి కేజీ ధర రూ.785 పడి రూ.35,045కు చేరింది. కారణం: అంతర్జాతీయ, దేశీ మార్కెట్లలో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బలహీన ధోరణి, అలాగే స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితి ఇదీ... కాగా బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో సైతం పసిడి, వెండి ధరలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నెమైక్స్ కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 15 డాలర్ల నష్టంతో 1,123 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా నష్టాల్లో 14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









