పాకిస్థాన్‌ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి పిలిపించింది..

- November 08, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి పిలిపించింది..

పాకిస్థాన్‌ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి పిలిపించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో సేవలందిస్తున్న అధికారులు అనురాగ్‌సింగ్‌, విజయ్‌కుమార్‌ వర్మ, మాధవన్‌ నందకుమార్‌లు మంగళవారం స్వదేశానికి పయనమయ్యారు. మహమూద్‌ అక్తర్‌తోపాటు మరికొంతమంది పాక్‌ దౌత్యవేత్తలు.. భారత్‌లో గూఢచర్యానికి పాల్పడ్డట్లుగా గత నెలలో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పేర్లు బహిర్గతం కావడంతో పాక్‌ వారిని వెనక్కిపిలిపించింది. ఇటు ప్రతీకార చర్యగా ఎనిమిది మంది భారత దౌత్యవేత్తలపై కూడా గూఢచర్య, ఉగ్రవాద సంబంధ ఆరోపణలు మోపుతూ పాక్‌ వివరాలు వెల్లడించింది. దీంతో భారత్‌ కూడా తమ దౌత్యవేత్తలను వెనక్కిరప్పించేందుకు చర్యలు తీసుకుంది.
మరో ఐదుగురు అధికారులు వాఘా సరిహద్దు ద్వారా రహదారి మార్గంలో భారత్‌కు రానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com