ప్రపంచంలోనే తొలి హైపర్‌లూప్ ఒప్పందం
- November 08, 2016
హైపర్ లూప్ వన్, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే ఇది హైపర్ లూప్ వన్‌కి తొలి ఒప్పందం. దుబాయ్‌లో చేపట్టనున్న హైపర్‌లూప్ ప్రాజెక్ట్ సాంకేతికంగా అత్యాధునికమైన రవాణా వ్యవస్థగా అభివర్ణించబడ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో హైపర్‌లూప్ ప్రాజెక్టులకు అవకాశాలున్నాయని, త్వరలోనే కొన్ని ఒప్పందాలు జరగనున్నాయని చెప్పారు హైపర్ లూప్ వన్ సిఇఓ రోబ్ లాయిడ్, దుబాయ్‌లో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం. ఒప్పందానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. గంటకు 1,125 కిలోమీటర్లు అంతకు మించిన వేగంతో ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చడం హైపర్‌లూప్ ప్రత్యేకత. భద్రత పరంగా చాలా మెరుగైన వ్యవస్థ అని హైపర్ లూప్ గురించి రోబ్ లాయిడ్ వివరించారు. డిపి వరల్డ్‌గ్రూప్ - దుబాయ్, తాము ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయదలచుకున్నట్లు గత నెలలో ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









