యూ.ఏ.ఈ. లో 18 తగ్గిన డీజిల్, 8.5 తగ్గిన పెట్రోల్

- August 28, 2015 , by Maagulf
యూ.ఏ.ఈ. లో 18 తగ్గిన డీజిల్, 8.5 తగ్గిన పెట్రోల్

అంతర్జాతీయ చమురు విపణిలో మార్పులను అనుగుణంగా, నెలవారీ ధరవరల సర్ద్దుబాటులో భాగంగా, యూ. ఏ. ఈ.  ఇంధన వనరుల శాఖ దేశంలో పెట్రోలు ధరను 8.5 శాతం, మరియు డీజిల్ ధరలను 18 శాతం  తగ్గించింది. దేశంలో అన్ని పంపులు  డీజిల్‌ను 1.86 దీనర్లకు, ఈ ప్లస్(ఆక్టెన్ 91) పెట్రోలును 1.89 దీనర్లకు; ఆక్టాన్ క్టే 95 ను 1.96 దీనర్లకు ఆక్టాన్ 98 ను 2.07 దీనర్లకు అమ్మాలని, సదరు శాఖ అండర్ సెక్రటరీ  డా. మాటర్ అల్ న్యాదీ నాయకత్వంలోని చమురు ధరల కమిటీ నిర్ణయించింది. ఈ ధరలు ప్రపంచవ్యాప్త సరాసరి చమురు ధరలకు, నిర్వహణ రుసుము, పంపిణీ సంస్థల కనీస లాభాలను కలిపి నిర్ణయించబడ్దాయని ఆయన వివరించారు. కాగా, సెప్టెంబరులో తగ్గిన ఈ చమురుధరలు,  ద్రవ్యోల్బణం పై ధరల సంస్కరణల బలహీన ప్రభావాన్ని సూచిస్తోందని, అబుధాబీ కమర్షియల్ బాంకు వారి ముఖ్య ఆర్ధికవేత్త ఐన డా. మోనికా మాలిక్ విశ్లేషించారు.

 

              --- సి. శ్రీ (దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com