శెనగలతో ఆరోగ్యం

- August 28, 2015 , by Maagulf
శెనగలతో ఆరోగ్యం

నానబెట్టిన గింజలుతృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ సంగతి తెలిసిందే. అయితే వాటిలో పెసలుమినుములుశెనగలు ఇవి నానబెట్టిన రెండు రోజుల్లోనే మొలకలు వస్తాయి. ఈ రకంగా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇవి చాలా రకాల అనారోగ్యాలను దూరం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ముఖ్యంగా శెనగలు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి పీచు పదార్ధం బాగా అందుతుంది. వీటిలోని మెగ్నీషియంఫోలేట్‌ ఖనిజాలు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడ్తుంది. శెనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా రొమ్ము కాన్సర్‌ కారకాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్తంలోని ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉంచేందుకు సహకరిస్తాయి. అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకంలాంటి సమస్యలుంటే తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహులకు కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com