జిసిసి దేశాల్లో త్వరలో యూనిఫైడ్‌ ట్రాఫిక్‌ చట్టం

- November 15, 2016 , by Maagulf
జిసిసి దేశాల్లో త్వరలో యూనిఫైడ్‌ ట్రాఫిక్‌ చట్టం

గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ దేశాలు, యూనిఫైడ్‌ ట్రాఫిక్‌ చట్టాన్ని జిసిసి రీజియన్‌లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టం ద్వారా ప్రమాదాల్ని నివారించవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ (ఎంఓఐ) జనరల్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ సాద్‌ అల్‌ ఖర్జి మాట్లాడుతూ, యూనిఫైడ్‌ ట్రాఫిక్‌ చట్టం అమలు ఎంతో దూరంలో లేదని తెలిపారు. జిసిసి ఎగ్జిక్యూటివ్స్‌ - ట్రాఫిక్‌ మీడియా అండ్‌ అవేర్‌నెస్‌ డివిజన్స్‌ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టానికి సంబంధించి 90 శాతం వర్క్‌ పూర్తయినట్లు తెలిపారాయన. జిసిసి దేశాల్లో రోడ్డు ప్రమాదాల్ని ఈ కొత్త చట్టం ద్వారా చాలావరకు తగ్గించవచ్చునని ఖర్జి చెప్పారు. యూనిఫైడ్‌ మీడియా ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచడం కూడా ముఖ్యమైన అంశమని ఆయన వివరించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ అండ్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ముహమ్మద్‌ రాధి అల్‌ హజిరి మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్‌ గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా వాహనాలు నడపాల్సి ఉంటుందనీ, తద్వారా ప్రమాదాల నివారణకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com