తెలంగాణా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ఉద్యోగావకాశాలు

- November 16, 2016 , by Maagulf
తెలంగాణా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ఉద్యోగావకాశాలు

హైదరాబాద్‌లోని తెలంగాణా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ కి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  
ఖాళీలు : జనరల్ మేనేజర్ (హోటల్స్) -1
అర్హత : హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో డిగ్రీతోపాటు 15 ఏళ్ళ అనుభవం వుండాలి.
వయస్సు: 35 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (మార్కెటింగ్)-1
అర్హత : మార్కెటింగ్ స్పెషలైజేషన్తో ఎంబిఏ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాతోపాటు టూరిజంలో కనీసం 5 అనుభవం వుండాలి.
వయస్సు: 35 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి.
ప్రాజెక్టు మేనేజర్ అర్హత: ఆర్కిటెక్చర్/సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమాతో పాటు టూరిజంలో కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉండాలి.  
వయస్సు: 35 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు పూర్తి బయోడేటాను పంపించాలి
చిరునామా :ఎండీ, టీఎస్‌టీడీసీ,3-5-891,టూరిజం హౌస్, హిమాయత్ నగర్, హైదరాబాద్.
చివరి తేదీ: 26 నవంబరు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com