నాగ్‌ పోలీస్‌ పాత్రలో...

- November 17, 2016 , by Maagulf
నాగ్‌ పోలీస్‌ పాత్రలో...

రొటీన్‌ చిత్రాలకు కాలం చెల్లింది. దాంతో యువ కథానాయకులే కాదు సీనియర్‌ హీరోలు సైతం తమకు సరిపోయే విభిన్న కథలు, పాత్రలనే ఎంచుకుంటున్నారు. 'మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి' వంటి విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నాగార్జున తాజాగా 'ఓం నమో వేంకటేశాయ' అనే భక్తిరస చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం చేస్తే బావుంటుందని ఆయన భావిస్తున్నారట. కార్తికేయ, ప్రేమమ్‌ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాగ్‌ కలయికలో సినిమా చేస్తే తన స్ధాయి మరింత పెరుగుతుందని చందు ఉవ్విళ్లూరుతున్నారట.వీరి కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం కోసం చందు ఓ మంచి పోలీస్‌ కథను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన లైన్‌ చెప్పి నాగ్‌ చేత అంగీకరింపజేసుకున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. చాలాకాలం తర్వాత నాగ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నారన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com