జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి'...

- November 17, 2016 , by Maagulf
జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి'...

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన భారీ సన్నివేశాలను పూర్తి చేశారు. తాజాగా బాలకృష్ణ, శ్రియ కాంబినేషన్‌లో పాటను కూడా పూర్తి చేయడంతో షూటింగ్ అయిపోయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగవంతం చేశారు. డిసెంబర్ మొదటివారంలో థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. రెండవ వారంలో ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com