ఈనెల10 నాటికి 3,456 మంది న్యాయమూర్తులను టర్కీ ప్రభుత్వం తొలగించింది
- November 18, 2016
టర్కీలో మరో 203 మంది న్యాయమూర్తులను తొలగించినట్టు అక్కడి న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్స్ నియామక కౌన్సిల్ (హెచ్‌ఎస్‌వైకే ) పేర్కొంది. కాగా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాలనను వ్యతిరేకిస్తూ జూలై15న సైనిక తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ తిరుగుబాటును అణిచివేయాలని ఎర్డోగన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు వీధుల్లోకి చేరుకుని తిరుగుబాటుదారులను చితకబాదారు. దీంతో, సైనిక తిరుగుబాటు విఫలమైంది. అయితే, ఈ తిరుగుబాటు వెనుక పెన్సిల్వేనియాలో ప్రవాసముంటున్న మత గురువు ఫెతుల్లా గులెన్ హస్తముందని ఎర్డోగన్ అనుమానిస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సముదాయాలను ఇప్పటికే మూసివేశారు.ఈ తిరుగుబాటుకు సహకరిం చిన ఆరోపణలపై పలువురు న్యాయమూర్తులు, సైనికాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్స్‌లను ప్రభుత్వం తొలగించింది. టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ తెలిపిన వివరాల ప్రకారం...ఈనెల10 నాటికి 3,456 మంది న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం తొలగించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









