ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఈ వారాంతంలో కురిసే అవకాశం
- November 20, 2016
దోహా: ఈ వారాంతంలో భారీగా కురిసే వర్షం కోసం సిద్ధంకండి. ఖతార్ వాతావరణ శాఖ గురువారం నుంచి ప్రారంభమయ్యే ఉరుములతో కూడిన బలమైన వర్షాలు కురవనున్నట్లు అంచనా మరియు శనివారం వరకు వానలు పడే అవకాశం ఉంది. దీనికి తోడు బలమైన గాలులు సైతం ఈ సమయంలో వేయవచ్చని వాతావరణ శాఖాధికారులు భావిస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం నుండి తేలికపాటి వర్షం ప్రారంభమై ఆ తర్వాత అవి గురువారం నుంచి క్రమేపి బలపడతాయని సూచిస్తున్నారు. వాతావరణం తెలిపే అంకెల పటాలు సూచించిన వివరాల ప్రకారం ఒక ఉన్నత స్థాయి అల్ప పీడన వ్యవస్థ యొక్క పొడిగింపు కారణంగా వాతావరణ అస్థిరత్వం కతర్ రాష్ట్రం ప్రభావితమవుతుందని భావించబడింది దీనితో మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఈ పరిస్థితి ఈ నెల చివరి వరకు కొనసాగుతుందని అని తెలిపారు.ఈ అస్థిరత ప్రభావంతో మంగళవారం మరియు బుధవారం కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం బలహీనమైన స్థితిలో పగటిపూట ప్రారంభమవుతుంది. అయితే, అస్థిరత్వం ప్రభావంతో గురువారం (నవంబర్ 24) నుంచి శనివారం (నవంబర్ 26) వరకు ఉరుములతో మరియు భారీ మెరుపులతో కూడిన వర్షం తాజా అగ్నేయ తూర్పు ప్రాంతాల్లో బలమైన గాలులు మరియు తీవ్రతతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్ర కెరటాలు కొన్ని ప్రాంతాలలో 7-10 అడుగుల నుంచి 13 అడుగుల ఎగిసిపడే అవకాశముందని భావిస్తున్నారు.అందువలన, నివాసితులు అందరూ జాగ్రత్తగా ఉండాలని కతర్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తాజా నవీకరణలను మరియు వాతావరణ సూచనలు పాటించాలని ఈ కాలంలో సముద్రం పైకి వెళ్లరాదని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









