ఒమాన్ లో పెరిగిన HIV అవగాహన - పరీక్షలకు ముందుకొస్తున్న ప్రజలు
- August 31, 2015
HIV గురించిన తప్పు అభిప్రాయాలు, మరియు వివక్ష తిరోగమనానికి సూచనగా అధిక సంఖ్యలో ప్రజలు పరీక్షలు చేయించుకోడానికి ముందుకొస్తున్నారని ఆరోగ్య శాఖ వారు తెలియజేశారు. తమ వార్షిక ఆరోగ్య నివేదిక - 2013 లో, అన్ని తరగతుల ప్రజలకు ఆరోగ్యపరమైన విద్యను అందించడం వల్ల మూఢనమ్మకాలు తగ్గి, ఈ మార్పు సాధ్యమైందని; 2013 సంవత్సరానికి గాను 103 కేసులు రిజిస్టర్ కాగా, నాటిలో 75 మగవారని; ఈ సంవత్సరంలో 31 AIDS మరణాలు సంభవించగా, 23 ముందటి సంవత్సరాలలోవని, తెలిపారు. 2013 సంవత్సరాంతానికి 1,511 ఒమాన్ ప్రజలు HIV కలిగిఉన్నారని, మెడికల్ రికార్డులలో, పరీక్షల ఫలితాలలో గోప్యతను పాటించడం వల్ల ఇది సాధ్యమైందని, ఆరోగ్య కేంద్రాలలో చికిత్స అందుబాటులో ఉండడం కూడా మరో కారణమని ఈ నివేదిక తెలియజేసింది. దేశంలో 1987లో ప్రారంభించబడిన AIDS కంట్రోల్ ప్రోగ్రామ్, ఇప్పటివరకు 2,394 కేసులను నమోదు చేసింది. ప్రమాద అవకాశం ఎక్కువగా ఉన్న పనులకు వ్యతిరేకంగా ప్రచారం చేసి, హెచ్చరికలు జారీ చేయడం, ఈ వ్యాధి ఇతరులకు సంక్రమించకుండా నిరోధించడం వంటి అంశాలపై ప్రచారం, AIDSసోకినపుడు, వీలైనంత త్వరగా గుర్తించడం, సరైన సమయానికి చికిత్స తీసుకోవడం, కాం ప్లికేషన్స్ ను నివారించడం, రోగ నిరూపణలో మెరుగైన వంటి వాటివలన మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు తెలియజేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









