వర్మ కు జరిమానా విధించిన కోర్టు

- August 31, 2015 , by Maagulf
వర్మ కు జరిమానా విధించిన కోర్టు

దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ హైకోర్టు రూ. పది లక్షల జరిమాన విధించింది. 2007 సంవత్సరంలో వర్మ 'ఆగ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించాడు. 1975లో హిందీలో విజయం సాధించిన 'షో'లే చిత్రానికి ఇది రీమెక్. ఒరిజినల్ సినిమాలో సన్నివేశాలు..పాత్రలు..నేపథ్య సంగీతాన్ని కాపీ చేశారని 'షో'లే నిర్మాత మనవడు సచ్చా సిప్పి కాపీరైట్ కింద వర్మపై గతంలో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వర్మతో పాటు 'ఆగ్' సినిమా నిర్మాతలు ఆర్ జీవి ప్రొడక్షన్ ప్రై.లి., వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ కూడా కేసులో దోషులుగా ఉన్నారు. అయితే 2007 ఆగస్టు 31న రిలీజ్ కాగా 2015 లో అదే రోజు ఈ సినిమాపై కాపీరైట్ విషయంలో తీర్పు వెలువడడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com