ఆత్మ బంధం

- September 01, 2015 , by Maagulf
ఆత్మ బంధం

నే నీకు అందమైన 
ప్రపంచము చూపించాలకున్న
ఆ అందమైన ప్రపంచంలో
నువ్వు నేను జీవించాలకున్నా,, 
కాని,, 
విధిరాతకు తలవంచో ఏమో
ఇది నా అసమర్థతనో ఏమో కాని
ఏడడుగులు నీతో నడిచి
ఏడునెలలు అవ్వకముందే
ఏడు సముద్రాలు దాటచ్చాను,,
ప్రతిజన్మకు తోడుంటానని
ఈ జన్మలో దూరంగా జీవిస్తు
మోయలేని బారాన్నే నీకప్పగించాను,,
దూరమనే బారాన్ని నువ్వుమోస్తు
జీవితమనే బరువును నేనుమోస్తు
అందమైన జీవితానికి
అర్థంలేకుంటా చేశానేమో,,
ఆనందానికి ఆమడ దూరంలో నువ్వు
సుఖానికి అందనంత దూరంలో నేను
సంసార సాగరంలో ఒడిదొడుకులను దాటుతు
బాద్యత అనే ముసుగులో నాకు తోడుంటు
దూరాన్ని బారాన్ని బరిస్తు,నా మాటను గౌరవిస్తు 
మనమిద్దరం అనేమాటకు అర్థం చేప్పినా నువ్వూ-- 
నా ప్రాణం,, 
నీ కోసం నా ప్రయాణం 
"నా ఆత్మ బంధమా"
ఈ క్షణం దూరమున్న
ప్రతి క్షణం నీ ఆలోచనల్లో
నేను నీ ~~శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com