అల్ మజెనా పేరుతో మాస్క్
- November 27, 2016
దుబాయ్: దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖామిస్ మట్టర్ అల్ మజెనా మృతి అనంతరం, ఆయన పేరుని అల్ కియాదా మాస్క్కి పెట్టారు. శుక్రవారం అల్ మెజనా అంత్యక్రియలు దుబాయ్‌లోని అల్ ఘుసైస్ గ్రేవ్‌యార్డ్‌లో నిర్వహించారు. అంతకుముందు జబీల్ మాస్క్‌లో ఫ్యునరల్ ప్రార్థనలు నిర్వహించారు. అల్ కియాదా మాస్క్ పేరుని అల్ మజెనా పేరుతో మార్పు చేయడంపై పోలీస్ అండ్ జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దహి ఖల్ఫాన్ తమీమ్ మాట్లాడుతూ, అల్ మజెనాను స్మరించుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. 33 ఏళ్ళకు పైగా దుబాయ్ పోలీస్ విభాగంలో ఎనలేని సేవలు అందించారు అల్ మజెనా. 2013లో అల్ మజెనా జనరల్ కమాండర్ ఆఫ్ దుబాయ్ పోలీస్‌గా ఎంపికయ్యారు. అంతకుముందు దుబాయ్ పోలీస్ డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









