రోడ్లను బాగుచేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మినిస్ట్రీ

- November 28, 2016 , by Maagulf
రోడ్లను బాగుచేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మినిస్ట్రీ

మనామా: భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు మినిస్ట్రీ 24 గంటలూ సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. ముహర్రాక్‌ మునిసిపాలిటీ, ముంపు ప్రాంతాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో సహాయక కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. రోడ్లను పొడిగా ఉంచేందుకు, అలాగే క్లీన్‌గా మార్చేందుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ప్రతి కంప్లయింట్‌నీ సునిశితంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు వారు వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మునిసిపాలిటీ 174 నోటిఫికేషన్లను అందుకుంది. ప్రధానంగా ముహర్రాక్‌ గవర్నరేట్‌ పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు చెప్పారు. సోషల్‌ మీడియాలో వీటికి సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా కూడా సహాయక చర్యల్ని చేపట్టారు అధికారులు. ట్విట్టర్‌, ఇన్‌స్టగ్రామ్‌లో ముహర్రాక్‌ మునిగిపోతోంది అనే పేరుతో కామెంట్స్‌, పోస్టింగ్స్‌ ట్రెండింగ్‌గా మారాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com