10 గ్రాముల పసిడి రూ.28,800....

- December 06, 2016 , by Maagulf
10 గ్రాముల  పసిడి   రూ.28,800....

బంగారం ధర పతనం కొనసాగుతోంది. ఇటీవలే ఆర్నెల్ల కనిష్ఠానికి చేరిన బంగారం మరోసారి నేల చూపులు చూసింది. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.28,800 పలికింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, నగదు కొరత బంగారం ధర తగ్గడానికి కారణమయ్యాయని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.
వెండి ధర కూడా రూ.100 తగ్గింది. ట్రేడింగ్‌లో కిలో వెండి రూ.41,100 పలికింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com