సౌర శక్తి పెట్టుబడులు స్వాగతించిన విద్యుత్ శాఖ మంత్రి

- December 07, 2016 , by Maagulf
సౌర శక్తి పెట్టుబడులు స్వాగతించిన విద్యుత్ శాఖ మంత్రి

మనామా: అబీనోగా సౌర శక్తి సంస్థ  సౌదీ అరేబియా శాఖ జనరల్ మేనేజర్ హిషం ఫైసల్ హెజైల నేతృత్వంలో అధికారులను విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మీర్జా,   స్వాగతించారు ఈ సందర్భంగా కంపెనీ అధికారులు సౌర శక్తితో పనిచేసే వారి ప్రాజెక్టులను  మరియు ఆయా  కార్యకలాపాలు మంత్రికి పరిచయం చేశారు మరియు బహరేన్ ప్రాజెక్టు రంగంలో తాము సైతం  ఒక భాగస్వామిగా పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ వారి కోరికను వెల్లడి చేశారు. బెహెరిన్ సందర్శినకు వచ్చిన ప్రతినిధి బృందంకు హార్దిక స్వాగతం తెలిపి ఆతిథ్యమిచ్చిన మంత్రి వారి ప్రాజెక్టులలో పునరుత్పాదక శక్తి  పెట్టుబడితో సహా స్థిరమైన శక్తి గూర్చి తెల్సుకొని వారి ప్రతిభను ప్రశంసించారు. డాక్టర్ మీర్జా మాట్లాడుతూ, బహరేన్ స్థిరమైన అభివృద్ధితో కూడిన యూనిట్ ప్రణాళికలను మరియు భవిష్యత్తు కార్యక్రమాలు సౌరశక్తిని రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి చాలా ఆసక్తి ఉందని     అన్నారు. సౌర శక్తి రంగాల్లో పనిచేస్తున్న సంస్థల సహకారంతో నూతన అవకాశాలు తెరిచేందుకు  కృషి చేస్తున్న అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.స్థిరమైన శక్తీ యూనిట్ ప్రాజెక్ట్ మేనేజర్ జెహన్ మార్బతీ మరియు మంత్రి సలహాదారులు సాంకేతిక వ్యవహారాల డాక్టర్ అహ్మద్ హషీం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com