గల్ఫ్‌తో బ్రిటన్ భద్రతా ఒప్పందాలు మరింత బలోపేతం
- December 08, 2016
గల్ఫ్ అరబ్ దేశాలతో భద్రతా రంగంలో సహకారం, ఒప్పందాల విషయంలో ఇంకా ఎక్కువ చొరవ చూపించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే చెప్పారు. బహ్రెయిన్‌లో జరిగిన గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ రంగానికి సంబంధించి రానున్న దశాబ్ద కాలంలో పెద్దయెత్తున పెట్టుబడుల్ని రీజియన్‌లో పెట్టనున్నట్లు ఆమె చెప్పారు. గల్ఫ్ సెక్యూరిటీ తమ సెక్యూరిటీ అని ఆమె నినదించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చే క్రమంలో గల్ఫ్ అరబ్ స్టేట్స్తో సంబంధాల కోసం చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారామె. జిసిసి దేశాలతో బ్రిటన్ ఆర్థిక, వ్యాపార సంబంధాలకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని తొలగించేందుకు కృషి చేస్తామని థెరీసా మే అన్నారు. ఇరాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో బ్రిటన్, అరబ్ దేశాలకు మద్దతుగా ఉంటుందని ఆమె తెలిపారు. గత ఏడాది మే నెలలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్, జిసిసి సమ్మిట్‌లో హాజరయ్యారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఇరాన్ విషయంలో జిసిసి దేశాలకు మద్దతు పలికారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







