తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ...

- December 08, 2016 , by Maagulf
తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ...

తెలుగు మీడియంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు.  తిరుపతిలో గురువారం జరిగిన తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశానికి పల్లె అధ్యక్షత వహించారు.  ఈ సమావేశానికి తెలుగు భాషా పండితులు, సాహితీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.  తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది.  ఈ పరిస్థితిని అధిగమించడం కోసం తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు మంత్రిని కోరారు.  ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.  ఇంటర్ వరకు తెలుగును తప్పని సరి చేస్తామని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కాలేజీలు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తామన్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు తీర్పలు మాతృభాషలో వచ్చేలా, అధికారులు ప్రజలతో తెలుగులోనే మాట్లాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com