డేట్స్ ఫెస్టివల్లో లోకల్ డేట్స్ హవా
- December 09, 2016
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చెస్ అల్ మజ్రౌవా యార్డ్‌లో డేట్స్ ఫెస్టివల్‌ని ప్రారంభించింది. 12 ఫామ్‌లు మరియు 3 కంపెనీలు ఈ ఈవెంట్లో పాల్గొన్నాయి. లోకల్‌గా ప్రొడ్యూస్ అవుతున్న డేట్స్‌ని ప్రమోట్ చేయడం ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. మినిస్ట్రీకి చెందిన ఫార్మర్స్ ఎఫైర్స్ హెడ్ ఖలీఫా అల్ అన్సారీ మాట్లాడుతూ, ఖతార్ సొసైటీలో ఇక్కడ తయారయ్యే డేట్స్‌కి ప్రాముఖ్యత ఎక్కువని అన్నారు. వీటి గురించి మరింత అవగాహన కల్పించే క్రమంలో ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేసినట్లు తెలిపారాయన. పలు రకాల సైజుల్లో, రుచుల్లో, రూపాల్లో ఉన్న డేట్స్ ఈ ఈవెంట్లో ప్రదర్శిస్తున్నారు. మూడు రోజులపాటు డేట్స్ ఫశ్రీస్టివల్ కొనసాగుతుందని అగ్రికల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ యూసఫ్ అల్ ఖులైఫి చెప్పారు. జిసిసి దేశాలతో కలిసి సంయుక్తంగా డ్రై డేట్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉందని అగ్రికల్చరల్ రీసెర్చ్ సెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ హమాద్ అల్ షమారి చెప్పారు.
తాజా వార్తలు
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!







