తమిళ్ రాకర్స్ అరెస్ట్...

- December 09, 2016 , by Maagulf
తమిళ్ రాకర్స్ అరెస్ట్...


సినీ దర్శక-నిర్మాతలకి గుడ్ న్యూస్. తమిళ్ రాకర్స్ అరెస్ట్ అయ్యారు. సినిమాలని పైరసీ చేయడంలో తమిళ్ రాకర్స్ డాట్ కామ్ సైట్ చాలా ఫేమస్సు అన్న సంగతి తెలిసిందే. రిలీజైన తొలి రోజే.. సినిమా మొత్తం తమిళ్ రాకర్స్ డాట్ కామ్ లో దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హాలివుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. సినిమాలని పైరసీ చేసి ఆన్ లైన్ లో ఉంచుతోంది.. ఈ వెబ్ సైట్. దర్శక-నిర్మాతలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఇటీవలే ఈ ముఠాని యాంటీ పైరసీ సెల్ అరెస్ట్ చేసింది. కోయంబత్తూరులో ట్రాక్ చేసి పట్టుకుంది. అయితే, ఈ ముఠా సభ్యుల నుంచి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారమ్.ఈ పైరసీ వెబ్‌సైట్‌కి అంతర్జాతీయ పైరసీ ముఠాలతో సంబంధాలున్నట్టుగా తెలినట్టు తెలుస్తోంది.పెద్ద సినిమాల విషయంలో ఫస్ట్ వీక్ టికెట్లు దొరకకపోవడం కారణంగా, బిజీ షెడ్యూల్ వలన, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వలన చాలా మంది జనాలు తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో సినిమా చూసేస్తున్నారు. ఇది సినిమా కలెక్షన్స్ పై విపరీతమైన ప్రభావం చూపుతోంది. Tamilrockers.cc (మార్చి 7వ తేదీ నుంచి)Tamilrockers.to, Tamilrockers.be, Tamilrockers.pm, Tamilrockers.ws, Tamilrockers.lu ఇలా తరచూ పేర్లు మార్చుకోవడంతో ఈ ముఠాని పట్టుకోవడం కష్టమైంది. తాజాగా, ఈ పైరసీ ముఠాని పట్టుకోవడం పట్ల సినీ దర్శక-నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com