కమెడియన్ కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్
- December 14, 2016
ప్రముఖ టాప్ కమెడియన్ కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పర్యావరణ భద్రతా చట్టం, ఎంఆర్టీపీ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాల కేసులో ఇరుక్కున్న ఆయన ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన బంగ్లాలో కార్యాలయం నిర్మించుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు లంచం అడిగారని, అచ్చేదిన్ (మంచిరోజులు) అంటే ఇవేనా అంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ట్వీట్ చేయడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. ఈ అక్రమ నిర్మాణం వ్యవహారంలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. కపిల్ శర్మ నివాసముంటున్న బిల్డింగ్ పూర్తిగా అక్రమమైనదని దాని ఇరుగుపొరుగువారు ఆరోపించారు.
అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉన్న కపిల్ శర్మ బంగ్లాను పూర్తిగా చట్టవిరుద్ధంగా కట్టారని వారు చెప్తున్నారు. అయతే, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మాత్రం కపిల్ శర్మ తన బంగ్లాలో పలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు పత్రాలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కాగా, కపిల్ బంగ్లా విషయంలో తాము కోర్టు ఆశ్రయించాలని భావిస్తున్నట్టు స్థానిక కోఆపరేటివ్ సోసైటీ చైర్మన్ అనురాగ్ పఠాక్ మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









