ఈ శనివారం ఖతార్ లో గాలులు- వర్షం వచ్చే అవకాశం

- September 04, 2015 , by Maagulf
ఈ శనివారం ఖతార్ లో గాలులు- వర్షం వచ్చే అవకాశం

ఖతార్ లో శుక్రవారం గాలులు మరియు ఇసుకతో కూడిన వాతావరణం అంతటా కనిపించింది. దోహా లో నిన్న (శుక్రవారం) ద ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం మరియు టార్చ్ టవర్ దుమ్ముతో కప్పబడి కనబడ్డాయి. ఇక నేడు దేశంలో బలమైన గాలులు, చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట  ఉష్ణోగ్రత - అబూ సామ్రాలో 42 డిగ్రీలు, మెసైఈద్, వక్రా, అల్ ఖోర్ మరియు దోహాలలో 39 డిగ్రీలు, , ఇంకా దుఖాన్ లో  37 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేశారు.  


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com