సైఫ్ అలీఖాన్ - కరీనా దంపతులకు పండంటి బిడ్డ..

- December 20, 2016 , by Maagulf
సైఫ్ అలీఖాన్ - కరీనా దంపతులకు పండంటి బిడ్డ..

బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌కు పండంటి మగబిడ్డ పుట్టాడు. సైఫ్ అలీఖాన్ - కరీనా దంపతుల మొదటి సంతానం మగపిల్లాడే. మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కరీనా మగబిడ్డను కన్నట్లు ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. ఉదయం 7.30 గంటలకు కొడుకు పుట్టాడని, తల్లీ బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. కాగా, కరీనా కపూర్‌కు మంచి స్నేహితుడైన దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసి, ఆమె కొడుకు పేరును కూడా బయటకు ప్రకటించేశాడు. బుడ్డోడి పేరు తైమూర్ అలీఖాన్ అని చెప్పాడు. బెబోకు కొడుకు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.

కరీనా - సైఫ్ అలీఖాన్‌ 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. సైఫ్ ఇంతకుముందు అమృతాసింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కొడుకు ఉన్నారు. ఇప్పుడు సైఫ్ మళ్లీ కొడుకును కన్నాడన్న మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com