బెర్లిన్‌లో ట్రక్కు బీభత్సం, 12మంది మృతి

- December 20, 2016 , by Maagulf
బెర్లిన్‌లో ట్రక్కు బీభత్సం, 12మంది మృతి

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌ చేసుకుందామని మార్కెట్‌కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్‌లోని కైసెర్‌ విల్హెమ్‌ మెమోరియల్‌ చర్చికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్‌ పండుగ సమీపిస్తుండంతో మార్కెట్‌ అంతా పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com