సోలార్‌ హెల్మెట్‌: ఎండలోనూ చల్లచల్లగా

- December 20, 2016 , by Maagulf
సోలార్‌ హెల్మెట్‌: ఎండలోనూ చల్లచల్లగా

ఖతార్‌లోని రీసెర్చర్స్‌ ఎండలో పనిచేసే కార్మికుల కోసం సోలార్‌ హెల్మెట్లను డిజైన్‌ చేశారు. ఈ హెల్మెట్ల ద్వారా బయట ఉన్న ఎండ నుంచి కార్మికులకు ఉపశమనం లభించనుంది. ఉష్ణోగ్రతను తగ్గించడం తద్వారా ఒత్తిడి తగ్గడంతో ఎండలో అయినా కార్మికులు మరింత ఉతాష్ట్ర్సహంగా పనిచేయగలుగుతారని సోలార్‌ హెల్మెట్‌ డిజైన్‌ చేస్తున్న ఎస్‌సి - ఎస్పైర్‌ సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికి సంంధించి అన్ని విధాల పరీక్షలూ పూర్తయ్యాయి. అలాగే పేటెంట్‌ హక్కుల్నీ దక్కించుకున్నట్లు ఎస్పైర్‌ - ఎస్‌సి సంయుక్తంగా ప్రకటించాయి. తక్కువ బరువుతోనే ఉండే ఈ హెల్మెట్లు కార్మికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ తరహా హెల్మెట్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సంచలనాలు సృష్టించగలవని వారు అంచనా వేశారు. ఎస్పైర్‌ - స్పోర్ట్‌ ప్రాజెక్ట్స్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ మహమౌద్‌ మాట్లాడుతూ, ఈ తరహా హెల్మెట్లను రూపొందించడం ద్వారా సరికొత్త సంచలనాలకు తెరలేపినట్లు భావిస్తున్నామనీ, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఎండలో ఉత్పన్నమయ్యే చెమట దగ్గర్నుంచి, అన్ని విషయాల్నీ పరిశోధించి సోలార్‌ హెల్మెట్లను రూపొందించారు. సాధారణ హెల్మెట్‌తో పోల్చితే ఈ సోలార్‌ హెల్మెట్‌కి 20 డాలర్లు అధికంగా ఖర్చవుతుంది. అయితే ఈ సోలార్‌ హెల్మెట్‌ ఇచ్చే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com