పాకిస్తాన్ లో రూ.5 వేల నోటు రద్దు

- December 20, 2016 , by Maagulf
పాకిస్తాన్ లో రూ.5 వేల నోటు రద్దు

పాకిస్తాన్ లోనూ పెద్ద నోట్లు రద్దయ్యాయి. 5 వేల నోట్లను రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదే సరైన మార్గమని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సెనేట్ ఆమోదం తెలిపింది. భారత్ లో పెద్ద నోట్ల రద్దు తర్వాత పాక్ లోనూ అదే పని చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దాయాది దేశాలు ఒక విషయంలో మాత్రం కామన్ గా ఆలోచించాయి. నల్లధనం అంతం కావాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలని భారత్ లో మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ సర్కార్ కూడా అదే పని చేసింది.

పెద్ద నోట్ల రద్దు. ఈ ఒక్క విషయంలో పాకిస్తాన్ భారత్ బాటనే అనుసరించింది. 5 వేల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి అక్కడి సెనేట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఒకేసారి కాకుండా 3 నుంచి ఐదేళ్లలో ఈ నోట్లను చెలామణి నుంచి తప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పాకిస్తాన్ లో ప్రస్తుతం 3.4 ట్రిలియన్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. వీటిలో లక్ష కోట్ల నోట్లు 5 వేల రూపాయలవే. వీటిని నిషేధించడం వల్ల నల్లధనానికి చెక్ పెట్టవచ్చనేది పాక్‌ ప్రభుత్వ ఉద్దేశం. ఈ విషయంలో భారత్ నుంచే తాము స్ఫూర్తి పొందామని పాక్ ప్రభుత్వం చెప్పడం విశేషం. అయితే నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని సర్కార్‌ భావించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com