చలికాలపు ఇబ్బందులా? హెర్బల్ టీలు ఉన్నాయిగా..

- December 22, 2016 , by Maagulf
చలికాలపు ఇబ్బందులా? హెర్బల్ టీలు ఉన్నాయిగా..

ప్రస్తుత కాలంలో ఎక్కువగా మనం వింటున్న పదం- "హెర్బల్ టీ", ఆర్గానిక్ కు పూర్తి వ్యతిరేఖంగా ఉండేదే హెర్బల్ టీ. హీర్బల్స్ లేదా మూలికల మరియు సహాజ ఆకులతో తయారు చేయటం వలన వీటిని హెర్బల్ టీ గా పేర్కొంటారు. ఈ హెర్బల్ టీని చాలా పురాతన కాలం నుండి తాగుతున్నారు మరియు వేడి సుగంధ పానీయ ద్రావణాన్ని 5000 సంవత్సరాల పూర్వం నుండి వాడుతున్నారు.

నిజంగా చెప్పలంటే, మూలిక ఆకులను వేడి నీటిలో ఉంచి, 3 నుండి 4 నిమిషాల పాటూ వేడి చేయటం వలన తయారు చేసే ద్రావణం లేదా కషాయంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ ఆకులను "కామెల్లియా సైనెన్సిస్" గా పేర్కొంటారు. చాలా సందర్భాలలో ఆరోగ్యాన్ని పెంచే మంచి సువాసన కలిగిన చల్లటి లేదా వేడి ద్రావణాన్ని టీకి పర్యాయపదంగా పేర్కొంటారు. 


కావున హెర్బల్ అనే పదాన్ని మూలికలు లేదా మూలికల నుండి తయారు చేసిన టీలకి వాడవచ్చు. ఈ రకం టీ ల వలన అనేక రకాల ప్రయోజానాలు ఉన్నాయి- ఏకాగ్రత నుండి మన శరీరంలో జీవక్రియ పెంచుట వరకు సహాయపడతాయి. ఒక కప్పు వేడి హెర్బల్ టీలో కావలసినన్ని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. దీనిలో కూడా కెఫీన్ ఉంటుంది కావున పిల్లలకు హెర్బల్ టీ లను ఇవ్వకూడదు. 

హెర్బల్ టీలను వేడి నీటిలో మూలికలను లేదా ఆకులను కలిపి తయారు చేస్తారు లేదా మూలికలను లేదా ఆకులను నీటిలో వేసి వేడి చేయటం ద్వారా హెర్బల్ టీ తయారు చేస్తారు.కామెల్లియా సినేన్సిస్ ప్లాంట్ నుండి చేసిన టీ మాత్రమే కాదు చాలా రకాల హెర్బల్ టీలలో కెఫీన్ ఉండదు.

చలికాలంలో హెర్బల్ టీ లను తాగటం వలన శరీరానికి పోషకాలను అందిస్తుంది. వేడిగా ఉండే ఈ ద్రావణం- శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచటమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అంతేకాకుండా, వీటిని రోజులో పరిమిత స్థాయిలో మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగటం వలన దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు. హెర్బల్ టీ లను తాగే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుడి సలహా తప్పక పాటించండి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com