కరగనున్నా అతి భారీ కాయం!

- December 22, 2016 , by Maagulf
కరగనున్నా అతి భారీ కాయం!

ప్రపంచంలోనే అతి భారీ కాయుడైన వ్యక్తి తన బరువును సగం మేరకు(290-300 కేజీలు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా అతడికి గ్యాస్ట్రో బైపాస్ సర్జరీ చేయనున్నట్లు మెక్సికోలోని ఓ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జువాన్ పెడ్రో అనే వ్యక్తి అరటన్ను (590కేజీలు) బరువుతో ప్రపంచంలోనే భారీ కాయుడిగా నిలిచాడు. అతిబరువు కారణంగా హై బీపీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నాడు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ట్రీట్ మెంట్ అవసరమని జువాన్ భావించాడని వైద్య బృందంలో ఒకరైన జోస్ కాస్టనెడా క్రూజ్ తెలిపారు.

రెండు విధానాలలో అతడికి చికిత్స అందిస్తామని, ఆపరేషన్ సమస్యలు తగ్గించేందుకు ఇలా చేయాల్సి వస్తుందని వివరించారు.

పూర్తి చికిత్స అందించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. మొదట అతడి బాడీ నుంచి సాధ్యమైనంత మేర బరువును తగ్గించనున్నట్లు, ఆ తర్వాత కొన్ని ప్రత్యేక చికిత్సతో మిగిలిన అతడి బాడీని కంట్రోల్‌లోకి తీసుకురావాలన్నారు. 

తనకు తానుగా ఆరు నెలల్లో 59 కేజీల బరువు తగ్గాలని భారీ కాయుడు జువాన్ పెడ్రో భావించాడని, వైద్యుల పర్యవేక్షణలో జరగకపోతే అది ప్రమాదకరమని డాక్టర్ కాస్టనెడా క్రూజ్ తెలిపారు. తాము ఇచ్చే చికిత్సతో ఆరు నెలల్లో దాదాపు సగం మేర బరువు తగ్గుతాడని, ఇది అతడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. 15 ఏళ్లకే 200 కేజీలకు పెరిగినట్లు చెప్పిన భారీ కాయుడు జువాన్ పెడ్రో మాట్లాడుతూ.. కాస్త ఆలస్యం అయినా సరే కచ్చితంగా సగం మేర బరువు(290-300 కేజీలు) తగ్గుతానని ధీమా వ్యక్తం చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com