డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు..
- December 22, 2016
తన దత్తత గ్రామాలైన సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పేదలకు కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఉదయం ఎర్రవల్లి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. సామాజిక భవనాన్ని ప్రారంభించి.. అక్కడ నిర్వహించిన వాస్తు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
గతేడాది విజయదశమి రోజు ముఖ్యమంత్రి ఈ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఆయన ప్రత్యేక దృష్టి సారించడంతో కేవలం 14 నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 159 ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







