పార్కింగ్ ప్లేస్ ఉండాల్సిందే కారు కొనాలంటే..
- December 23, 2016
దేశ వ్యాప్తంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని రూల్స్ విధించే యోచనలో ఉంది. ముఖ్యంగా కొత్త కార్ల రిజిస్ట్రేషన్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పార్కింగ్ స్పేస్ లభ్యత ఉందని చూపే సర్టిఫికెట్లను అందజేశాకే వాటి రిజిస్ట్రేషన్ ను అనుమతించాలని, ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇదే విషయాన్ని ప్రకటించారు.
ఇకపై టాయిలెట్ లేని ఏ నిర్మాణాన్నీ అనుమతించే ప్రసక్తి లేదని, అలాగే పార్కింగ్ స్పేస్ అవైలబిలిటీ లేనిదే ఏ వాహన రిజిస్ట్రేషన్ నూ అనుమతించే ప్రసక్తి కూడా లేదని ఆయన చెప్పారు. దీనిపై తమ మంత్రిత్వ శాఖ రోడ్లు, జాతీయ రహదారుల మినిస్ట్రీ తో చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు.
భోపాల్ లో గూగుల్ మ్యాప్స్ టాయిలెట్ లొకేటర్ యాప్ ను వెంకయ్య లాంచ్ చేశారు. ఈ యాప్ వల్ల దగ్గరలోని పబ్లిక్ టాయిలెట్ ని ప్రజలు గుర్తించడానికి వీలవుతుందని వెంకయ్య చెప్పారు. స్వచ్చ భారత్ మిషన్ లో ఇదో భాగమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







