బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు మరో గౌరవ డాక్టరేట్

- December 24, 2016 , by Maagulf
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు మరో గౌరవ డాక్టరేట్

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఉర్దూ భాషా అభివృద్ధికి ఎంతోగానో కృషి చేసిన సంజయ్ సరఫ్ లకు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ నెల 26న(సోమవారం) హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా షారుక్ ఖాన్, సంజయ్ సరఫ్ లు డాక్టరేట్ తీసుకోనున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో వర్సీటీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్ట్‌షైర్, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయాల నుంచి షారుఖ్‌ఖాన్ గౌరవ డాక్టరేట్ లభించిన విషయం తెలిసిందే. గత కొనేళ్లుగా షారుఖ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, సినిమాల్లో అతని నటనకుగానూ ఈ గుర్తింపు లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com