స్మార్ట్‌ఫోన్ యాప్‌ద్వారా 36,000 ట్రాఫిక్ ఉల్లంఘనల నమోదు..
- December 25, 2016
36,646 రోడ్ ఉల్లంఘనలు దుబాయ్ పోలీస్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా గత 11 నెలల్లో నమోదయినట్లు అధికారిక లెక్కల ప్రకారం వెల్లడవుతోంది. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు, ప్రజలే వాటిని పోలీసులకు తెలియజేసేలా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ రూపొందిందనీ, అది మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్స్, ఫొటోలు, వీడియోల్ని పోలీసులకు పంపించడం ద్వారా ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వవచ్చు. సంప్రదాయ పద్ధతిలో 42,500 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. పోలీస్ పెట్రోల్స్, రాడార్ల ద్వారా ఈ ఉల్లంఘనలు గుర్తింపబడ్డాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









