విశాఖకు రానున్న పవన్‌కళ్యాణ్..
- December 26, 2016
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వచ్చే నెల రెండున నగరానికి రానున్నారు. 2014 ఎన్నికల తర్వాత పవన్‌కల్యాణ్ తొలిసారి నగరానికి వస్తుండడంతో ఘనస్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెల మూడున పవన్‌కల్యాణ్ బహిరంగసభ ఏర్పాటుచేశారు. ఆ సభలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్ జనవరి రెండున సాయంత్రం ఆరు గంటలకు విమానంలో విశాఖ చేరుకుంటారు. ఆరోజు రాత్రి నోవాటెల్ హోటల్‌లో బసచేస్తారు. మూడవ తేదీ ఉదయం ఏడు గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రోడ్డుమార్గంలో శ్రీకాకుళం చేరుకుంటారు. ఉదయం పది గంటల నుంచి 12 గంటలవరకూ అక్కడ జరిగే సభలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటలకు విశాఖ చేరుకుంటారు.
ఆరోజు నగరంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించే అవకాశం వున్నట్టు సమాచారం. జనవరి నాలుగున తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. ఈ మేరకు పర్యటన ఖరారైనట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









