పెరల్‌ హార్బర్‌ను సందర్శించనున్న జపాన్‌ ప్రధాని..

- December 26, 2016 , by Maagulf
పెరల్‌ హార్బర్‌ను సందర్శించనున్న జపాన్‌ ప్రధాని..

జపాన్‌ ప్రధాని షింజో అబే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కలిసి పెరల్‌ హార్బర్‌ను సందర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడిని అతిపెద్ద మలుపుగా పేర్కొంటారు. ఈ ఘటనతో అమెరికా 2300 సైనికులను నష్టపోయింది. దీంతో అమెరికా యుద్ధ రంగంలోకి దిగి జపాన్‌పై అణుదాడి చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అబే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సందర్శనలో భాగంగా అబే మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు కానీ ఎటువంటి క్షమాపణలు చెప్పరని జపాన్‌ అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం హవాయిలోని జరిగే సమావేశంలో ఒబామాతో కలిసి పాల్గొంటారు. పెరల్‌ హార్బర్‌ ఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తైన తర్వాత మూడు వారాలకు అబే అమెరికాను సందర్శిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com