గోపీచంద్ కొత్త సినిమాకు రంగం సిద్ధం

- September 08, 2015 , by Maagulf
గోపీచంద్ కొత్త సినిమాకు రంగం సిద్ధం

గోపీచంద్ కథానాయకుడిగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెజీనా కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ భావోద్వేగాలు మేళవించిన కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యత వుంటుంది. గోపీచంద్ పాత్ర సరికొత్త పంథాలో వుంటుంది. సినిమాలోని కీలక పాత్రను మలయాళ నటుడు దేవన్ పోషిస్తున్నారు అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ డ్బ్భైశాతం చిత్రీకరణ పూర్తయింది. గోపీచంద్ శైలి యాక్షన్, కామెడీ అంశాలతో సాగిపోయే చిత్రమిది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది. ఐదుపాటలుంటాయి. అనూప్ రూబెన్స్ చక్కటి బాణీలతో పాటలిచ్చారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. జానకి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ, అశుతోష్ రానా, ప్రదీప్‌రావత్, నాజర్, ముఖేష్‌రుషి, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, రచన: ఘటికాచలం, సంగీతం:అనూప్‌రూబెన్స్, మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై. జయసూర్య చిత్రంలో నా పాత్ర వైవిధ్యంగా వుందని అందరూ ప్రశంసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com