అలసట మాయం

- April 18, 2015 , by Maagulf

ఆరోగ్యంగానే కనిపిస్తున్నాం కానీ... ఈ మధ్య బాగా అలసటగా ఉంటోందని చెబుతుంటారు కొందరు. మీరూ అలాంటి వారిలో ఒకరైతే చేసుకోవలసిన మార్పులు కొన్ని ఉన్నాయి.

 

పోషకాహారం: కొన్నిసార్లు పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి అన్నిరకాల పోషకాలందేలా పచ్చి కూరగాయలు తీసుకొని చూడండి.మీరెంచుకునే కూరగాయలు పలు రంగుల్లో ఉండాలి. శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు, మాంసకృతులు అందినా అలసట తగ్గుతుంది. ఇవి కాకుండా పొటాషియం, ఇనుమూ, మగ్నిషియం, 'బి' విటమిన్లు కూడా అవసరం. ఇవన్ని మిమ్మల్ని చురుగ్గా మారుస్తాయి.

 

యోగా చేయండి: ఆహార పరంగా జాగ్రతలు తీసుకుంటున్నా,జీవనవిధానంలో చురుకుదనం లోపించినప్పుడు అలసట తప్పదు. దీన్ని అధిగమించాలంటే యోగా చేసి చూడండి.దాంతోపాటు డాన్సు, శరీరాన్ని వేగంగా కదిలిస్తూ నడవటం వంటివీ అలసటను తగ్గించే మార్గాలే.

 

సరదాగా గడపాలి: చిన్నప్పుడు ఇసుకతో ఆడుకోవడం, కాగితాలతో బొమ్మలు చేయడం, పిల్లలతో కలిసి ఆడటం వంటివి గుర్తున్నాయా...వాటిని పెద్దయ్యే కొద్దీ మానేయాలని లేదు. అలాంటి ఆటలూ, చిలిపిపనులూ మీ జీవితంలో ఓ భాగం కావాలి. వాటివల్ల ఉత్సాహం వస్తుంది, అలసట దరిచేరదు.

 

కంటినిండా నిద్ర: రోజూ మీరెన్ని గంటలు నిద్రపోతారో గమనించుకోండి. ఆరు గంటలయితే దాన్ని ఏడున్నరకు పెంచండి. అదికూడా హాయిగా నిద్రపోయేలా చూసుకోండి. దానివల్ల అలసట తగ్గుతుంది. పడుకునే ముందు కాఫీ, టీలు తాగడం, టీవీ చూడటం లాంటివి మానేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com