యెమెన్ మృత్యుఘోష

- September 09, 2015 , by Maagulf
యెమెన్ మృత్యుఘోష

యెమెన్‌ సంక్షోభం ఇంకా కలవరపెడుతూనే వుంది. ఏ క్షణం ఏమవుతుందో తెలీని పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాకుల శబ్దాలు, వైమానిక దాడుల మోతతో హోరెత్తుతోంది. ఇలాంటి భీతావహ వాతావరణం... పౌరులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా...... చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా సౌదీ వాయుసేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ఈ దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందినట్లు తెలుస్తోంది. యెమెన్ లోని హుదైదా పోర్టు సమీపంలో సౌదీ దేశాల వాయుసేనలు సంయుక్తంగా ఆయిల్ స్మగ్లర్లపై దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వైమానిక దాడుల్లో రెండు బోట్లు ధ్వంసం?.... వాయుసేనలు ఆకస్మికంగా చేసిన దాడిలో రెండు బోట్లు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు, మత్యకారులు చెబుతున్నారు. ఈ ఘటనలో భారత దేశానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. వాయుసేనలు చేసిన దాడుల్లో 12 మంది తిరుగుబాటు దారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతవారం తిరుగుబాటు దారులు చేసిన దాడిలో సుమారు 60 మంది ఎమిరేట్స్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com