చిన్నారుల భద్రత కోసం రాయల్ ఒమాన్ పోలీస్ ఆన్లైన్ డ్రైవ్

- September 09, 2015 , by Maagulf
చిన్నారుల భద్రత కోసం రాయల్ ఒమాన్ పోలీస్ ఆన్లైన్ డ్రైవ్

ఒమాన్ లోని బిద్ బిద్ లో, ఒంటరిగా బస్సులో వదిలివేయబడడం వల్ల ఊపిరాడక 4 సంవత్సరాల బాలిక మరణం అనంతరం, రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్. ఓ. పి.) వారు చిన్నారుల భద్రత కోసం ఆన్‌లైన్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వాహనానికి తాళంవేసి వెళ్ళిపోయెముందు అందరు చిన్నారులు దిగి వెళ్లినట్టుగా డ్రైవర్లు ధృవపరచుకోవడం తప్పనిసరి అని పోలీసువారు అంటుండగా, పిల్లలను రవాణా చేయడం అనేది అధిక శ్రద్ధవహించవలసిన విషయం; పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక సహాయం అవసరమవడం సహజం; డ్రైవరు ప్రతిచోట ఆగి, పిల్లలను సరిగ్గా దిగారా లేదా అని గమనించవలసిన పరిస్థితిని కేవలం కొద్దిమంది మాత్రమే ఒంటరిగా చక్కదిద్డగలరని  ఇందుకు సహాయకులు అవసరమని, ఐతే సహాయకులకు ప్రభుత్వం వీసాలు మంజూరు చేయడం లేదని, ఇకనైనా కనీసం స్కూలు బస్సుల సహాయకులకు వీసా మంజురుచేయడం అత్యవసరమని, 30 ఏళ్లుగా మస్కట్ లో డ్రైవరుగా పనిచేస్తున్న ఎన్.ఎస్. రాజీవ్ వివరించారు. ఏదిఏమైనా తమ పిల్లలను సురక్షితంగా అప్పగించడం ట్రా న్స్పోర్టర్ బాధ్యత అని తల్లిదండ్రుల వాదన. గత సంవత్సరం కూడా ఇలాగే బలైపోయిన ఇద్దరు, ఇంకా ఎందరో తల్లితండ్రుల గర్భశోకాన్ని అరికట్టడానికి  ప్రభుత్వం ఇకముందైనా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్న ది నిర్వివాదాంశం.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com