షార్జా లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు: ఆపివేయబడిన తరగతులు

- September 09, 2015 , by Maagulf
షార్జా లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు: ఆపివేయబడిన తరగతులు

ఈ మంగళవారం ఉపాధ్యాయుల గదిలో మంటలు రేగటo వల్ల, షార్జా మోడల్ స్కూల్ ఫర్ బాయ్స్ ను తాత్కాలికంగా మూసివేశారు. టీచర్లు మరియు 579 మంది విద్యార్ధులను వెనువెంటనే తరలించారుఎవరూ గాయపడిన లేదా ఉక్కిరిబిక్కిరైనట్టుగా తెలియరాలేదు. షార్జా ఫైర్ స్టేషన్ల డైరక్టర్ మేజర్ సయీద్ అల్ సువైదీ, తమకు ఉదయం 9 గంటలకు ప్రమాద సమాచారం తెలియవచ్చిందనీ, దస్మాన్ పోలీస్ స్టేషన్ నుండి పాఠశాలకు హుటాహుటిన 3 నిముషాల్లో చేరుకున్న ఫైర్ ఫైటర్లు, భవనం రెండోవైపుకు అగ్ని వ్యాప్తించకుండా నిరోధించి, కేవలం 8 నిమిషాల్లో దాన్ని ఆర్పివేశారని వివరించారు. పొగ చాలా దట్టంగా వ్యాప్తించడం వల్ల విద్యార్ధులను ఇళ్లకు పంపామని, తరగతులు గురువారం తిరిగి ప్రారంభమవుతాయని పాఠశాల డైరక్టర్ అమీనా అహ్మద్ తెలిపారు. పాఠశాలలో అగ్నిమాపక యంత్రసామగ్రి లేదని, ఇంకా సిబ్బందికి ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగించడంలో కూడా శిక్షణ ఇవ్వవలసి ఉందని ఆమె అంగీకరించారు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com