న్యూఇయర్ వేడుకల్లో 13 మందిని చంపిన ఉన్మాది..
- January 02, 2017
గొడవలేమిటో తెలియదు కానీ, ఆయనకు ఆమె విడాకులు ఇచ్చింది.. అప్పటినుంచి ఆమెపై కక్ష పెంచుకున్న భర్త.. భార్యనే కాదు మరో 12 మందిని న్యూయర్ వేడుకలరోజే అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. అంతేకాదు ఈ ఉన్మాది సృష్టించిన రక్తపాతంలో మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రేయ బ్రెజిల్‌కు చెందిన సిడ్నే రమిస్ డి అరజో(46) అనే ల్యాబ్ టెక్నీషియన్‌ను కొద్ది రోజుల క్రితం భార్య వదిలిసేంది. అయితే, తన 8 ఏళ్ల బాలుడితో కలిసి ఆమె.. కాంపినస్ పట్టణంలో రమిస్‌కు దూరంగా ఉంటుంది. దీంతో ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హతమార్చి ప్రతికారం తీర్చుకోవాలనుకున్నాడు.
పథకం ప్రకారం తుపాకి, అదనపు బుల్లెట్లు, కత్తి, పేలుడు పదార్థాలను తీసుకుని కారులో భార్య ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో బంధువులతో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటుంది. వెంటనే వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. రమిస్ కాల్పుల్లో భార్య, కొడుకు సహ 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాల్చి చంపిన తర్వాత రమిస్ తనకుతాను కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమిస్ కాల్పుల బారి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి బాత్‌రూమ్‌లో దాక్కొని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన సమయంలో కాల్పుల శబ్ధం వినిపించినా న్యూఇయర్ వేడుకల శబ్ధంగా భావించి అంతగా పట్టించుకోలేదని, ఇద్దరుముగ్గురు మాత్రం ఆ ఇంటి నుంచి బుల్లెట్ గాయాలతో మా ఇంటివైపు పరుగుత్తెడం చూసినంక అసలు విషయం తెలిసిందని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రమిస్ కారు, కారులో నుంచి పేలుడు పదార్థాలు, ఆడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆడియో రికార్డ్ లో నిందితుడు ఏదైనా సందేశం రికార్డు చేశాడా, లేదా అనే అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







