అత్యాధునిక సుఖోయ్‌ విమానాలు చైనాకి అందజేసిన రష్యా..

- January 02, 2017 , by Maagulf
అత్యాధునిక సుఖోయ్‌ విమానాలు చైనాకి అందజేసిన రష్యా..

మన పొరుగు దేశమైన చైనాకు రష్యా అత్యాధునిక సుఖోయ్‌ ఎస్‌యూ -35 యుద్ధవిమానాలను అందజేసింది. ఇప్పటికే చైనా జె-20 స్టెల్త్‌ జెట్‌ను తయారు చేస్తుండటంతో రష్యా ఈ డీల్‌ విషయంలో వేగంగా వ్యవహరించింది. జె-20లు సిద్ధమైతే చైనా మార్కెట్లో ఎస్‌యూ-35 విలువ పడిపోతుందని రష్యా భయపడింది. అందుకే రెండేళ్లుగా నిదానంగా ఉన్న ఈ డీల్‌ను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా డిసెంబర్‌ 25న రెండు విమానాలను చైనాకు అందజేసింది. ఈ విషయాన్ని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తెలిపింది.
చైనా ఇప్పటికే తన వాయుసేన ఆధునికీకరణను వేగవంతం చేసింది. దీనిని పూర్తిగా కొత్తతరం ఫైటర్‌ జెట్లతో నింపుతోంది.

స్టెల్త్‌జెట్‌ జె-15 ఇప్పటికే చైనా వాయుసేనలో చేరింది. ప్రస్తుతం దీనిని విమాన వాహక నౌకపై దక్షిణ చైనా సముద్రంలో మోహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com